- Advertisement -
నాగపట్నం: శ్రీలంక పైరేట్ల దాడిలో ఆరుగురు మత్స్యకారులు గాయపడ్డారు. సోమవారం రాత్రి కొడియాకరాయి ఆగ్నేయ తీరానికి 13 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. రెండు స్పీడ్ బోట్లలో వచ్చిన 15మంది పైరేట్లు ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. తమ వద్ద ఉన్న వలలు, జిపిఎస్ పరికరం, ఇతర వస్తువుల్ని పైరేట్లు ఎత్తుకెళ్లారని వారు తెలిపారు. నీళ్లలోనే గంటసేపు పైరేట్లతో మత్స్యకారులు ఘర్షణ పడ్డారు. నాగపట్నం నుంచి వచ్చిన మత్స్యకారుల మరో బృందం అక్కడికి చేరుకోవడంతో పైరేట్లు పారిపోయారు. బాధితులను తోటి మత్స్యకారులు తీరానికి చేర్చారు. బాధితులంతా సెర్తూర్‌కు చెందినవారని తీర పరిరక్షక బృందం (సిఎస్‌జి) తెలిపింది. నాలుగు రోజుల క్రితం వెల్లపాలెంకు చెందిన ముగ్గురు మత్స్యకారులపై శ్రీలంక పైరేట్లు ఇదే తరహా దాడికి పాల్పడ్డారు.
- Advertisement -