- Advertisement -
భద్రాచలంలో దారుణం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు భవనం శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ట్రస్టు పేరుతో విరాళాలు సేకరించి పాత భవనం మీదనే మరో నాలుగు అంతస్థులను నిర్వాహకులు నిర్మాణం చేశారు. నిర్మాణంలో నాణ్యత లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయి పలువురు మృతి చెందగా.. నలుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది సహాయకచర్యలు ప్రారంభించారు. ఐటిసి నుంచి క్రేన్లు, ప్రొక్లెయిన్లు రప్పించి శిథిలాలను తొలగిస్తున్నారు. కూలిన భవనం పక్కనే నిర్వాహకులు ఆలయ నిర్మాణం కూడా చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -