Wednesday, January 22, 2025

ఆరుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఖరీదైన కార్లలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు స్మగ్లర్లను లంగర్‌హౌస్, టిఎస్ నాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 44కిలోల గంజాయి, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ టిఎస్‌ఐసిసిసిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వాంకుడోతు వీరన్న అలియాస్ వీరు, అజ్మీరా వీరన్న అలియాస్ లాలు, సూర్‌నేని మనోజ్ అలియాస్ మణి, మెరుగు మధు, తేజావత్ ప్రశాంత్ నాయక్, ఎండి జహంగీర్ కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు వాంకుడోతు వీరన్న 2006లో పదోతరగతి ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తన సోదరులతో కలిసి హాస్టల్‌లో ఉండేవాడు.

పదోతరగతి అక్కడే ఉండా పాస్‌అయిన తర్వాత 2009లో అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్‌లో ఈఈఈ డిప్లమా చేశాడు. తర్వాత రాణిగంజ్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో క్రెడిట్ కార్డు సెక్షన్‌లో పనిచేశాడు. అక్కడ తక్కువ జీతం ఇస్తుండడంతో ఉద్యోగం మానివేసి, నారాయణ ఈ టెక్నో స్కూల్‌లో పనిచేశాడు. తన మేనమామ తేజావత్ చందా(70) గంజాయి రవాణా చేసేవాడు. విశాఖ ఏజెన్సీ ఏరియా నుంచి తీసుకుని వచ్చి హైదరాబాద్‌లో విక్రయించేవాడు. అతడితో తిరిగి గంజాయి స్మగ్లింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. చందా వృద్ధుడు కావడంతో గంజాయి రవాణాను వదిలేశాడు. అతడి ద్వారా విశాఖ, ఒడిసాలోని మల్‌కాన్‌గిరి ప్రాంతంలోని గంజాయి పండించే వారితో పరిచయాలు పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతాల నుంచి గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి హైదరాబాద్, మహారాష్ట్రలో అధిక ధరకు విక్రయిస్తున్నాడు.

ఇలా కోట్లాది రూపాయలు సంపాదించాడు. నిందితుడు గంజాయి అమ్మగా వచ్చిన డబ్బులతో ఖరీదైన కార్లను(టాటా హెక్సా, ఎంజి, ఫార్చూనర్) కొనుగోలు చేసి వాటికి హైదరాబాద్, ఆటోనగర్‌లో మాడిఫై చేసి గంజాయి రవాణా చేస్తున్నాడు. గంజాయి రవాణా చేస్తున్న వాహనాల ముందు తన వాహనానికి పోలీస్ సైరన్ పెట్టుకుని ముందు వెళ్లే వాడు. దీంతో చెక్‌పోస్టులు, టోల్‌గేట్ల వద్ద పోలీసులు తనిఖీలు తప్పించుకుని కార్లను ముందుకు తీసుకుని వచ్చేవాడు. ఇలా గంజాయి విక్రయించగా వచ్చిన డబ్బులతో సూపర్ మార్కెట్, వైన్స్ షాపుల్లో పెట్టుబడి పెట్టాడు. తన సొంత గ్రామం గూడురులో ఖరీదైన ఇంటిని నిర్మించుకుని జల్సాలు చేస్తున్నాడు. నిందితుడి విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసిపట్టుకున్నారు. డిసిపి సునీత, ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News