Sunday, January 19, 2025

100 రోజుల్లో ఆరు గ్యారంటీలు

- Advertisement -
- Advertisement -

అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టిన సిఎం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభం

రూ.10లక్షలకు పరిమితి పెంచిన ‘ఆరోగ్యశ్రీ’ అమల్లోకి..

రాష్ట్రవ్యాప్తంగా 77.19 లక్షల మందికి లబ్ధి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అసెంబ్లీ ఆవరణలో రెండు పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరు గ్యారంటీల అమలుపై సిఎం రేవంత్ రెడ్డి కీలక వ్యా ఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమ లు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రెండు హామీలైన మహిళలకు ఉచిత బస్సు (మహాలక్ష్మి పథకం), ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10లక్షల పెంపును సిఎం ప్రా రంభించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో పథకాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఈ రోజు పండుగ అని రేవంత్ రెడ్డి అ న్నారు. డిసెంబర్ 9వ తేదీన 2009లో ప్రత్యేక తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. నాది తెలంగాణ అని చె ప్పే అవకాశం సోనియమ్మ కల్పించారన్నారు.

సోనియా గాంధీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చారని వంద రోజుల్లో వీటిని అమలు చేస్తామన్నారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ప్రజలకు ఉచిత అందిస్తామన్నారు. ఈ సం దర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ఆరోగ్యశ్రీ లోగోతో పాటు పో స్టర్‌లను ఆవిష్కరించారు. అంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఉచిత వైద్య సదుపాయానికి సంబంధించి నోట్‌ఫైల్‌పై సిఎం రే వంత్ సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇత ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంత కుముందు మహి ళా మంత్రులు, మహిళా ఎంఎల్‌ఎలు, మహిళా ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సిఎం రేవంత్ రెడ్డి బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ జర్నలిస్టులు, ఇతర ప్రముఖులకు ఉచిత బస్సు ప్రయాణ టికెట్ ను అందించారు. అయితే, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉచితం గా ప్రయాణించగా రేవంత్ మాత్రం డబ్బులు చెల్లించి టికెట్ తీసుకున్నారు.
ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి సిఎం నివాళి
ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించాక అసెంబ్లీ నుంచి మహిళా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు సిఎం, డిప్యూటీ సీఎం తదితరులు ట్యాంక్‌బండ్‌కు బస్సులో వెళ్లారు. అక్క డ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి అదే బస్సులో అసెంబ్లీ ప్రాణంగానికి చేరుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల 19 వేల ఆరోగ్య శ్రీ కార్డులు
తెలంగాణలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రు ల్లో ఆరోగ్య శ్రీ సేవలను అందించబోతు న్నారు. 293 ప్రైవేటు ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రు లు, 809 పిహెచ్‌సిలలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య శ్రీ పథకం కింద 1,376 శస్త్ర చికిత్సలు, 289 వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News