Thursday, December 19, 2024

కర్నాటక హైకోర్టు జడ్జిలకు బెదిరింపు వాట్సాప్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి కె మురళీధర్‌కు వాట్సాప్ ద్వారా చావు బెదిరింపులు వెలువడ్డాయి. తనతో పాటు హైకోర్టుకు చెందిన ఆరుగురు న్యాయమూర్తులను చంపివేస్తామని ఇందులో ఉందని ఆయన తెలిపారు. ఈ నెల 12వ తేదీన తనకు ఓ అంతర్జాతీయ ఫోన్ నెంబరు ద్వారా వాట్సాప్ సందేశం వచ్చిందని, తనను చంపేస్తామని బెదిరించారని న్యాయమూర్తి ఈ నెల 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను హైకోర్టుకు చెందిన ఆరుగురు న్యాయమూర్తులు మెహమ్మద్ నవాజ్, హెచ్‌టి నరేంద్ర ప్రసాద్, అశోక్ జి నిజగన్నవర్ (రిటైర్డ్), జస్టిస్ హెచ్‌పి సందేశ్, కె నటరాజన్, బి వీరప్ప (రిటైర్డ్)లను దుబాయ్ గ్యాంగ్‌తో లేపేయిస్తామని ఈ వాట్సాప్ సందేశంలో తెలిపారని ఈ న్యాయమూర్తి తెలిపారు

. వీరి హత్యకు పారితోషింకగా రూ 50 లక్షలను ఇస్తున్నట్లు, దీనిని పాకిస్థాన్‌లోని ఓ బ్యాంక్ ఖాతాకు పంపిస్తున్నట్లు కూడా మిస్సెజ్‌లో పేర్కొన్నారు. బెంగళూరులోని సెంట్రల్ సెన్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు న్యాయమూర్తి నుంచి బెదిరింపు గురించి ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధృవీకరించారు. ఈ వాట్సాప్ సందేశానికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తుల పేరిట కేసు పెట్టినట్లు, పలు భాషలలో వచ్చిన ఈ మిస్సెజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పంపించడానికి కారణాలు ఏమిటీ ? అనే విషయంపై ఇప్పుడు ఉన్నత స్థాయి పోలీసు బృందాలు ఏర్పాటు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News