Thursday, January 23, 2025

యుపిలో ఎండదెబ్బ..ఆరుగురు హోంగార్డుల మృతి

- Advertisement -
- Advertisement -

మాడు పగులగొట్టే ఎండలు, గుక్కతిప్పుకోనివ్వని ఉక్కపోతలు, పైగా ఎన్నికల విధులు నడుమ ఉత్తరప్రదేశ్‌లో డస్సిపోయిన స్థితిలో ఆరుగురు హోంగార్డులు ప్రాణాలు వదిలారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు విపరీత స్థాయికి చేరాయి. వడగాడ్పులతో పరిస్థితి దిగజారింది. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల డ్యూటీలు నిర్వహిస్తున్న హోంగార్డుల పరిస్థితి నరకం అయింది. ఎండదెబ్బలను తట్టుకునే సరైన ఏర్పాట్లు లేని డ్యూటీల క్రమంలో మీర్జాపూర్‌లో ఆరుగురు చనిపోయ్యారని వెల్లడైంది. రాజస్థాన్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలోనూ పలువురు మృతి చెందారు. మీర్జాపూర్‌లో 23 మంది వరకూ హోంగార్డులు ఎండతీవ్రతతో ఆసుపత్రి పాలయినట్లు మీర్జాపూర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్‌బి కమల్ విలేకరులకు తెలిపారు.

వీరిలో ఆరుగురు మృతి చెందినట్లు, మిగతావారికి చికిత్స జరుపుతున్నట్లు వివరించారు. బిపి పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, ఇతరత్రా అవలక్షణాలతో వీరు చికిత్స పొందుతున్నారు. ఇక ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలిపారు. అగ్నిమాపక దళం సిబ్బంది కూడా ఎక్కువగా ఎండదెబ్బకు గురవుతోంది. ఉత్తర భారతంలో ఎండ తీవ్రతతో కూలీలు, రిక్షావాలాలు, ఇతర శ్రామికుల పరిస్థితి దారుణంగా మారింది. ఎర్రటి ఎండల్లోనే వారు పనికి దిగాల్సి రావడంతో , నిర్ణీత ఆదేశాల ప్రకారం వారు మధ్యాహ్నం మూడు వరకూ రెస్ట్‌లో ఉండాలి. కానీ దీనిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. దీనితోనే ప్రాణాలకు గండం ఏర్పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News