Sunday, December 22, 2024

రూ.826కోట్లతో జంక్షన్ల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

కెబిఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి సిఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. పార్క్ చుట్టూ రూ.826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రూ.421 కోట్లతో తొలిదశలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌తో పాటు కెబిఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే రెండోదశలో రోడ్డు నెం.45 జంక్షన్, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనులు చేపట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, నిధులు విడుదల కాగానే త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వై ఆకారంలో అండర్‌పాస్
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వై ఆకారంలో అండర్‌పాస్, నాలుగులేన్ల రహదారికి కెబిఆర్ ఎంట్రన్స్ వద్ద, యూసుఫ్‌గూడ వైపు వెళ్లే మార్గంలో రెండు లేన్ల ప్లైఓవర్‌ను రూ.421 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. కెబిఆర్ ఎంట్రన్స్ అండ్ ముగ్ధ జంక్షన్ వద్ద రెండు లేన్ల అండర్‌పాస్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద (క్యాన్సర్ ఆస్పత్రి) వెళ్లే వైపున అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మూడు లేన్ల యుని డైరెక్షన్‌లో (పంజాగుట్ట వైపు) వెళ్లే మార్గం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద నిర్మాణం చేయనున్నారు. ఇక మూడు లేన్ల అండర్‌పాస్‌ను కెబిఆర్ ఎంట్రన్స్ జంక్షన్ (పంజాగుట్ట వైపు) వెళ్లే మార్గంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో రూ.405 కోట్లతో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 జంక్షన్, ఫిల్మ్‌నగర్ జంక్షన్, మహారాజ అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్‌ల వద్ద రెండు లేన్ల అండర్‌పాస్‌లు, రెండు లేన్ల ప్లైఓవర్‌లను ప్రభుత్వం నిర్మించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News