Monday, January 20, 2025

పెళ్లి తిరుగు ప్రయాణంలో విషాదం..

- Advertisement -
- Advertisement -

గిరిధ్ : జార్ఖండ్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా ప్రయాణిస్తున్న ఎస్‌యువి రోడ్డు పక్కన ఉన్న చెట్టును వేగంగా ఢీకొందని పోలీసులు తెలిపారు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో థోరియా గ్రామం వద్ద తెల్లవారుజామున మూడు గంటలకు దుర్ఘటన జరిగింది. వాహనం నడిపిన వ్యక్తి మగతలో ఉండటం ఈ ప్రమాదానికి దారితీసిందని ప్రాధమిక సమాచారం ప్రకారం వెల్లడైంది. ప్రమాద వివరాలను స్థానిక పోలీసు స్టేషన్ అధికారి కమ్లేష్ పాశ్వాన్ వార్తాసంస్థలకు తెలిపారు. గాయపడ్డ ఇద్దరు పిల్లల పరిస్థితి ఇప్పుడు కొంత నిలకడగా ఉందని వెల్లడైంది. బాధితులు ముస్లిం కుటుంబానికి చెందిన వారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News