కాబూల్ : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ లోని పాఠశాలలను లక్షంగా చేసుకొని మంగళవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. విద్యార్థులతో కలిపి కనీసం ఆరుగురు మృతి చెందారని పోలీసులు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వరుస పేలుళ్లకు ఆత్మాహుతి దాడే కారణంగా అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం మొదట పశ్చిమ కాబూల్ లోని ముంతాజ్ స్కూల్‌లో పేలుడు సంభవించింది. తరువాత రెండో పేలుడు అబ్దుల్ రహీం షాహిద్ స్కూలులో సంభవించింది. పాఠశాలలకు సమీపంలో వెనువెంటనే మూడు పేలుళ్లు సంభవించాయి. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని కాబూల్ పోలీస్ విభాగం అధికార ప్రతినిధి ఖాలిద్ జడ్రాన్ వెల్లడించారు. రెండంతస్థుల స్కూలు భవనం లోపలి గోడలు రక్తం మరకలతో ఉన్నాయని, పుస్తకాలు , పిల్లల జోళ్లు కాలిబూడిదయ్యాయని అసోసియేటెట్ ప్రెస్ జర్నలిస్టు చెప్పారు. అయితే ఈ దాడులకు ఎవరు బాధ్యులో ఇంకా తెలియరాలేదు.
కాబూల్ స్కూళ్లలో వరుస పేలుళ్లు.. ఆరుగురి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -