Thursday, December 19, 2024

బొగ్గు గనిలో ఆరుగురు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

కోహిమా : నాగాలాండ్ వోఖా జిల్లాలో ఒక అక్రమ బొగ్గు గని లోపల సంభవించిన అగ్ని ప్రమాదంలో కనీసం ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారని, మరి నలుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారి ఒకరు వెల్లడించారు. వోఖా జిల్లా భండారి సబ్ డివిజన్‌లోని రిచన్యన్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ ప్రమాదం సంభవించినట్లు భండారి ఎంఎల్‌ఎ అచుమ్‌బెమో కికోన్ శుక్రవారం ఒక వార్తా సంస్థకు తెలియజేశారు.

ఈ పరిస్థితి సమీక్షకు భండారిలో కికోన్ ఉన్నారు. అస్సాంకు చెందిన కార్మికులు అక్రమ బొగ్గు గనిలో తవ్వకంలో నిమగ్నమయ్యారని, అగ్ని ప్రమాదంలో వారిలో ఆరుగురు దుర్మరణం చెందగా మరి నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. క్షతగాత్రులను దిమాపూర్‌లో ఆసుపత్రికి వెంటనే తరలించినట్లు అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News