Wednesday, January 22, 2025

కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

పూణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలో శుక్రవారం ఒక కొవ్వొత్తుల తయారీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు వ్యక్తులు మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో తాలావాడె వద్ద ఉన్న ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కమిషనర్ శేఖర్ సింగ్ తెలిపారు.

పుట్టినరోజు వేడుకల్లో ఉపయోగించే కాకరపువ్వొత్తిలా వెలిగే కొవ్వొత్తులను ఈ ఫ్యాక్టరీలో తయారుచేస్తారని ఆయన తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చామని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. క్షతగాత్రులను పుణెతోపాటు పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ ప్రాంతంలోని ఆసుపత్రులలో చేర్చి, చికిత్స అందచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News