Monday, January 20, 2025

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై : నాగపూర్ పుణె జాతీయ రహదారిపై ఉదయం 7.20 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడ్డారు. ముంబైకి 450 కిమీ దూరంలో బుల్ధానా జిల్లా లోని సింద్‌కేదార్ రాజా పట్టణ ప్రాంతం లో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంఎస్‌ఆర్‌టిసి)బస్సు 33 మంది ప్రయాణికులతో పుణె నుంచి మెహకర్ రూటులో వెళ్తుండగా,

పలక్షేడ్ చక్క గ్రామం వద్ద ఎదురుగా స్పీడ్‌గా వస్తున్న ట్రక్కు ఢీకొంది. మృతుల్లో నలుగురు ప్రయాణికులు కాగా, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. గాయపడిన వారిలో ముగ్గురిని సింద్‌కేదార్‌రాజా ఆస్పత్రికి, 15మందిని పొరుగునున్న జల్నా జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలోఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండు వాహనాలు తుక్కుతుక్కు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News