Sunday, January 19, 2025

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జాతీయ రహదారి 58పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. కారు ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళుతోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీస్‌లు వెల్లడించారు. బాధితులంతా ఢిల్లీ లోని షహదారా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించినట్టు చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News