- Advertisement -
సేలం: తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అత్తూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం మార్చురీకి తరలించారు.
- Advertisement -