Tuesday, January 28, 2025

శబరిమలకు 9 రోజుల్లో 6 లక్షల మంది రాక

- Advertisement -
- Advertisement -

కేరళ లోని శబరిమలలో మండల మకరవిళక్కు సీజన్‌లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల్లోనే ఆరు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని దేవస్థానం (ట్రావెన్‌కోర్ దేవస్వాం) బోర్డు వెల్లడించింది. నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా, ఇప్పటివరకు 6,21,290 మంది దర్శించుకున్నట్టు టీబీడీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. గత ఏడాది ఇదే వ్యవధిలో కేవలం 3,03,501మంది మాత్రమే దర్శించుకున్నట్టు గత ఏడాది రూ. 13.33 కోట్ల ఆదాయం రాగా, ఈసారి ఇప్పటివరకు రూ.41.64 కోట్ల ఆదాయం విరాళాల రూపంలో వచ్చాయన్నారు. పోలీస్‌ల ముందస్తు చర్యలతో ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులు ఆలయం లోని పవిత్రమైన మెట్లను ఎక్కగలుగుతున్నారని చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News