Sunday, December 22, 2024

జాతీయ క్రీడా పోటీల్లో టిఎస్ ఆర్‌టిసి ఉద్యోగులకు ఆరు పతకాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో ఇటీవల జరిగిన 5వ ఆలిండియా మాస్టర్స్ గేమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు సత్తా చాటారు. ఇందులో ఆర్‌టిసికి చెందిన ముగ్గురు ఉద్యోగులు ఆరు పతకాలను సాధించారు. కె. శ్రీనివాస్ స్విమ్మింగ్ 50 మీటర్ల విభాగంలో రెండు గోల్డ్ పతకాలతో పాటు 100 మీటర్ల విభాగంలో ఒక సిల్వర్ పతకం గెలుపొందారు. ఇక ఆర్చరీ 50 మీటర్ల విభాగం ( మహిళ కేటగిరి)లో ఎం. అంజలికి గోల్డ్ పతకం వరించింది. ఆర్చరీ 50 మీటర్ల విభాగం కంపౌండ్ బీఓడబ్లూలో సిల్వర్, షూట్ ఔట్‌లో బ్రాంజ్ పతకాలను కె. కిషన్ సాధించారు. ఈ ఏడాది మేలో సౌత్ కొరియాలో జరిగే ఇంటర్నేషనల్ ఆసియా ససిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌కు కే. శ్రీనివాస్, ఎం. అంజలి, కే. కిషన్‌లు ఎంపికయ్యారు.

ఆలిండియా మాస్టర్స్ గేమ్స్‌లో టిఎస్ ఆర్‌టిసి ఉద్యోగులు సత్తా చాటి 6 పతకాలు సాధించడం పట్ల సంస్థ ఎండి విసి సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన కె. శ్రీనివాస్, ఎం. అంజలి, కే.శ్రీనివాస్‌లను బస్ భవన్లోని తన ఛాంబర్‌లో బుధవారం నాడు ఆయన అభినందించారు. సౌత్ కొరియాలో జరిగే ఇంటర్నేషనల్ ఆసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌కు ఎంపికైనందుకు వారిని ప్రశంసించారు. నిరంతర కృషి, ప్రాక్టీస్‌తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. సౌత్ కొరియాకు వారు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఎండి సజ్జనార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ ఆఫీసర్ వెంకట నారాయణ, సిపిఎం కృష్ణకాంత్, ఫిజియో హిమాన్షు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News