Sunday, February 23, 2025

అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. వలూజ్‌లోని చత్రపతి శంభాజీనగర్‌లో అర్ధరాత్రి 2.15 గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హ్యాండ్ గ్లవ్స్ తయారీ కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగాయి. 10 నుంచి 15 మంది కార్మికులు నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయి. మంట్లో చిక్కుకొని ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కంపెనీ సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News