Monday, December 23, 2024

గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు… ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Six Members dead in Gujarat chemical factory blast

అహ్మదాబాద్ : గుజరాత్ రాష్ట్రం లోని భారుచ్ జిల్లా లోని కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం సంభవించిన పేలుడులో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. అహ్మదాబాద్ నగరానికి 235 కిమీ దూరం లోని దహేజ్ పారిశ్రామిక వాడ లోని కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారు జామున పేలుడు సంభవించింది. పరిశ్రమ లోని రియాక్టర్ పేలడంతో అక్కడ సమీపంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మరణించారు. కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేశామని భారుచ్ జిల్లా ఎస్పీ లీనాపాటిల్ చెప్పారు. పేలుడుకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News