- Advertisement -
న్యూఢిల్లీ : దేశం లోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల్లో ఆరుగురు మరణించారు. ఉత్తరాఖండ్ , కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదుల్లో వరద నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది. ఉత్తరప్రదేశ్ లో గంగానదీ నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో వరణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, బలియా నగరాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. యూపీ లోని ప్రయాగరాజ్ నగరం లోని గంగానదీ తీర ప్రాంతం లోని ఇళ్లు వరద నీటిలో మునిగాయి. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని డెహ్రాడూన్ నగరంలో ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు. కేరళ లోని తోడుపూజ కుడియాత్తూర్‌లో సోమవారం ఉదయం ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు
- Advertisement -