Sunday, December 22, 2024

కర్నూలులో రక్తమోడిన రహదారులు…. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Six members dead in Kurnool road accident

 

అమరావతి: కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం రహదారులు రక్తమోడాయి. కర్నూలు జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులు అనంతపురం జిల్లా ధర్మవరం వాసులుగా గుర్తించారు. దామగట్ల క్రాస్ రోడ్డు వద్ద ఆర్‌టిసి బస్సు బొలెరో ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. 15 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News