Thursday, January 23, 2025

బస్సును ఢీకొట్టిన ట్రక్కు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం ఝార్సుగూడలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రూర్కెలా సమీపంలో ఝార్సుగూడ- సంబాల్‌పూర్ బిజూ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వీరు సురేంద్ర సాయి ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రిసెర్చ్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఓ ప్రైవేటు కంపెనీకి సంబంధించిన సిబ్బందిని జెఎస్‌డబ్ల్యు ప్లాంట్ నుంచి ఝర్సుగూడకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ట్రక్కు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారి మోహపత్రా తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News