అమరావతి: శ్రీశైలంలో శివుడిని దర్శించుకొని ఇంటికి వెళ్తుండగా టాటాఏస్ లారీని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రెంట చింతల ప్రాంతం బిసి కాలనీకి చెందిన రెండు కుటుంబాలు శ్రీశైలం దేవుడిని దర్శించుకోవడానికి వెళ్లారు. దేవుడిని దర్శించుకుకొని ఇంటికి వస్తుండగా రెంట చింతల శివారులో టాటాఏస్ ను డ్రైవర్ వేగంగా నడిపాడు. తనకు తెలిసిన దారి అనే నిర్లక్ష్యంతో డ్రైవర్ డ్రైవింగ్ చేశాడు. ర టాటాఎస్ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీ వెనకభాగంలో ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 38 ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గుంటూరులోని సర్వజనాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
లారీని ఢీకొట్టిన టాటాఏస్: ఆరుగురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -