Thursday, January 23, 2025

యుపి రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

5 died in Car collided with electric pole at Prayagraj

ప్రయాగ్‌రాజ్ న్యూస్:ఉత్తర్  ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో హైవేపై గురువారం ఉదయం ఒక ఎస్‌యువి వాహనం ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడిన దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. నిద్రమత్తులో డ్రైవర్ వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. హండియా పోలీసు స్టేషన్ పరిధిలోని టోల్ ప్లాజాకు 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని వారు చెప్పారు. మృతులంతా మహిళలేనని, ఇందులో ఇద్దరు పిల్లలు ఉన్నారని వారు చెప్పారు. ఒక చిన్నారికి తలనీలాలు సమర్పించడానికి వింధ్యాచల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని, కారులో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెఇపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News