Sunday, February 23, 2025

పెళ్లి బృందం… ట్రాక్టర్ బోల్తా: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పూతలపట్టులో గురువారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… ఐరాల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన 25 మందితో కూడిన ట్రాక్టరు లో పూతలపట్టు మండలం జెట్టిపల్లి గ్రామానికి వివాహ వేడుకకు వెళుతుండగా మార్గమధ్యంలో లక్ష్మయ్య గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఆరుగురు చనిపోయారు. మృతులలో ముగ్గురు ఆడవాళ్లు, ఒక డ్రైవర్, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News