Thursday, January 23, 2025

బోల్తాపడిన ట్రక్కు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Six Members dead in Truck roll over in Jharkhand

రాంఛీ: కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడిన సంఘటన జార్ఖండ్‌లోని పలాజు జిల్లా హరిహర్‌గంజ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. జార్ఖండ్‌లోపి పంకీ గ్రామానికి చెందిన కూలీ పనుల నిమిత్తం బిహార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులలో ముగ్గురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. క్షతగాత్రులలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News