- Advertisement -
లక్నో: కారును బస్సు ఢీకొట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ లోని సంబల్ పూర్ లో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఓ ప్రైవేటు బస్సు ఢిల్లీ నుంచి బులంద్ షహర్ వెళ్తుండగా సంబల్ పూర్ సమీపంలో 93వ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో నుంచి మృతదేహాలను తీయడానికి కష్టపడ్డారు. గ్యాస్ కట్టర్ సహాయంలో కారులో భాగాలను విభజించి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు వ్యక్తులు ఉన్నారు. బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -