- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఘోరం ప్రమాదం జరిగింది. దుర్గాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి జనరేటర్ పేలడంతో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. దుర్గాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
- Advertisement -