Tuesday, January 21, 2025

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరంతా దైవదర్శనం కోసం వెళ్తుండగా ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వీరంతా రణతంబోర్ గణేశ్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను సికార్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీస్‌లు ఆ సంఘటన స్థలానికి వెళ్లి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News