హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో ఆరుగురు నూతన న్యాయమూర్తులు మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేయించారు. ఈక్రమంలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార్తీక్, కాజా శరత్ న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు.కాగా న్యాయవాదుల కోటాలో ఆరుగురు న్యాయమూర్తులు నియామకమైన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా హైకోర్టులో 28 మంది జడ్జిలు ఉండగా కొత్త న్యాయమూర్తులతో మొత్తం సంఖ్య 34కు చేరింది. రాష్ట్రం ఆవిర్భావం అయిన అనంతరం హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24 ఉండగా ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఆరుగురు ప్రమాణస్వీకారం చేయగా మరో ఎనిమిది జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన న్యాయమూర్తులకు సిజె జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభినందనలు తెలిపారు.
ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -