- Advertisement -
కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇదివరకేన ఆరుగురు జడ్జీలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రతిపాదించిన సంగతి విదితమే. ఈ ప్రతిపాదనలకు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్, కాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వీరు త్వరలోనే హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
- Advertisement -