Monday, March 3, 2025

సాగర్ కింద మరో ఆరు లిఫ్టులు

- Advertisement -
- Advertisement -

మరో లక్ష ఎకరాలు సాగునీటికి సర్కారు సన్నాహాలు

మన తెలంగాణ/హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో అదనంగా ఆరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను ప్రారంభించి వచ్చే రెండేళ్ల కాలంలో వీటిని పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటి ద్వారా జిల్లాలో మరో లక్ష ఎకరాల మేరకు సాగునీటి సదుపాయం కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. నాగార్జనసాగర్ ప్రాజెక్టు, ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ కింద రూ.1,259 కోట్ల వ్యయంతో మరో ఆరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను ప్రతిపాదించి నిధులు మంజూరు చేసింది. వాటిలో రూ.692.40 కోట్లతో నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రూ.219.90 కోట్లతో దున్నపోతులగండి–బల్నేపల్లి–చంప్లతండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రూ.229.25 కోట్ల వ్యయంతో బోతలపాలెం—వాడపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రూ.9.30 కోట్లతో తోపుచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రూ.32.22 కోట్లతో వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రూ.75.93 కోట్ల వ్యయంతో కేశవాపురం కొండ్రపోలు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో వీటిని పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ప్రభుత్వం మంజూరు చేసిన ఆరు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల వివరాలు
క్రమసంఖ్య లిఫ్ట్ స్కీమ్ పేరు వ్యయం(రూ.కోట్లల్లో)
1 నెల్లికల్ 692.40
2 దున్నపోతులగండి–బల్నేపల్లి–చంప్లతండా 219.90
3 బోతలపాలెం—వాడపల్లి 229.25
4 తోపుచర్ల 9.30
5 వీర్లపాలెం 32.22
6 కేశవాపురం కొండ్రపోలు 75.93
మొత్తం 1,259.00

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News