Sunday, January 19, 2025

ఆరుగురు సజీవ దహనమైన కేసును చేధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల:మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సం భవించింది. ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి మాసు శివయ్య అనే వ్యక్తి ఇల్లు దగ్ధం అయింది. క్రమంగా ఇంటి మొత్తానికి మంటలు వ్యాపించడంతో కుటుంబ సభ్యులతోపాటు మరో వ్యక్తి మృత్యువాత పడ్డా డు. ఈ ఘటన పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అగ్ని ప్రమాదమా.. హత్యాయత్నమా చర్చ జరుగుతోంది.

మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుడిపేట గ్రామంలో జరిగిన అ గ్నిప్రమాదంలో మాసు శివయ్య(5౦) అతని భా ర్య రాజ్యలక్ష్మీ(పద్మ)(45), సింగరేణి కార్మికు డు శనిగారపు శాంతయ్య(52), పద్మ అక్క కు మార్తె గడ్డం మౌనిక(4౦), మౌనిక పెద్ద కుమార్తె హిమబిందు(4), ఏడాది వయస్సున్న రెండో కు మార్తె స్వీటి అగ్నికి ఆహుతయ్యారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపూర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు శాంత య్య, శివయ్య భార్య పద్మతో సహజీవనం చేస్తున్నాడు.

ఆరుగురు సజీవ దహనమైన కేసును పోలీసులు చేధించారు. ఆరుగురు సజీవదహనానికి వివాహేతర సంబంధం, కక్షలే కారణం. భర్తతో వివాహేతర సంబంధమున్న ఓ మహిళ ఇంటికి నిప్పు భార్య పెట్టింది. ప్రియుడితో కలిసి ఇంటికి నిప్పు పెట్టినట్లు ప్రాథమిక నిర్థారణలో వెల్లడైంది. ఈ కేసులో పోలీసులు నలుగురు ఆనుమానితులను అదుపులలోకి తీసుకున్నారు. నిందితులు పెట్రొల్ బంక్ లో పెట్రొల్ కొనుగొలు చేసిన సిసిటివి పుటేజిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News