Monday, December 23, 2024

టిఎస్ఎండిసి లో ఆరుగురు అధికారులపై వేటు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లో పనిచేస్తున్న ఉద్యోగుల అవినీతిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు జిఎంలు, మరో ముగ్గురు పిఓలపై ప్రభుత్వం వేటు వేసింది. మార్చి 09 తేదీన ‘మనతెలంగాణ దినపత్రిక’లో టిఎస్‌ఎండిసి సంస్థలో ‘డిప్యూటేషన్ అధికారులదే ఇష్టారాజ్యం’ అనే పేరుతో వచ్చిన కథనంపై ప్ర స్పందించింది. ఈ నేపథ్యంలో పలువురు అవినీతి అధికారులపై చర్యలు చేపట్టింది. వేటు పడిన వారిలో టిఎస్‌ఎండిసిలో డిప్యూటేషన్‌పై జిఎంలుగా పనిచేస్తున్న పాండురంగారావు, దేవేందర్ రెడ్డి, ప్రశాంతిలతో పాటు ప్రాజె క్టు ఆఫీసర్స్ (పిఓలు) దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌లను మాతృసంస్థలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, ఆక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News