Wednesday, January 22, 2025

రెండు బస్సులు ఢీకొని ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలో శనివారం తెల్లవారు జామున రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తున్న బస్సును నాసిక్ వైపు వెళ్తున్న మరో బస్సు ఢీకొంది. నాసిక్ వైపు వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని బుల్దానా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ కడస్నే చెప్పారు.

జాతీయ రహదారి 53లోని మల్కాపుర్ టౌన్ ఫ్లైఓవర్ మీద శనివారం తెల్లవారు జాము 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు మహిళలతోసహా మొత్తం ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల బుల్దానా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 25 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News