Friday, April 4, 2025

పాదచారులపైకి దూసుకెళ్లిన ఎస్‌యువి..ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

బీహార్‌లోని బంకా జిల్లాలో వేగంగా వస్తున్న ఎస్‌యువి ఢీకొనడంతో ఆరుగురు పాదచారులు మరణించారు. శుక్రవారం రాత్రి ఫుల్లిదుమర్ పోలీసు స్టేషన్ పరిధిలోని నగర్‌ది సమీపంలో పాదచారులు రోడ్డును దాటుతుండగా ఈ ఘటన జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించినట్లు సబ్ డివిజనల్ పోలీసు అధికారి బిపిన్ బిహారీ తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎస్‌యువి డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని ఆయన చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పాదచారులు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News