Wednesday, January 22, 2025

కారు బావిలో పడి ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

హజరీబాగ్ : ఝార్ఖండ్ లోని హజరీబాగ్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం కారు బావిలో పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. హజరీబాగ్ జిల్లా రోమీ గ్రామ సమీపంలో ఎస్‌యువి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన బావిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని హజరీబాగ్ ఎస్‌పి మనోజ్ రతన్ చౌదే తెలియజేశారు. బైకును తప్పించడానికి ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసినట్టు ఆయన చెప్పారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక పిల్లవాడు ఉన్నారు. రిస్కూ బృందాలు వచ్చి బావి లోంచి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు మహిళల్లో ఇద్దరిని ఆస్పత్రికి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News