Thursday, January 9, 2025

తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో
అపశ్రుతి భారీగా తరలివచ్చిన భక్తులు అదుపు
చేయడంలో టిటిడి విఫలం మృతుల్లో ఐదుగురు
మహిళలు ఎపి సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

మన తెలంగాణ/హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి కి ముందు తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద రద్దీ పెరిగి జరిగిన తోపులాటలలో ఆరుగురు దుర్మరణం చెందారు. తిరుపతిలోని వి ష్ణునివాసంతో పాటు బైరాగిపట్టెడ రామానాయు డు స్కూల్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. రెం డు చోట్ల తోపులాటలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీరిని తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రుయాలో నలుగురు, స్విమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు భక్తులుచనిపోయారు. మొత్తం ఐదుగురు మహిళా భక్తులు సహా ఆరుగురు మృతి చెం దారు. మృతులలో ఒకరిని తమిళనాడు సేలంకు చెందిన మహిళగా గుర్తించారు.గురువారం ఉద యం 5గంటలకు జారీచేసే వైకుంఠ ద్వారదర్శ నం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సిబ్బంది ముందుగా భక్తులను రోడ్లపై గు మికూడకుండా పార్కులో ఉంచారు. అనంతరం పద్మావతి పార్కు నుంచి భక్తులను క్యూలైన్లలోకి వ దిలారు. ఈ సమయంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో తోపులాట జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ష్ణునివాసం, బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్‌తో పాటు, సత్యనారాయణపురంలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద కూడా తోపులాట జరిగింది. ఇక్కడ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10,11, 12 తేదీల్లో వైకుంఠద్వార సర్వదర్శనం కోసం, టోకెన్ల జారీని టీటీడీ రేపు ఉదయం నుంచి జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. రోజుకు 40 వేల చొప్పున 3 రోజుల్లో లక్షా 20వేల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించగా, ఇవాళ సాయంత్రం నుంచే భక్తులు బారులు తీరారు. రద్దీ ఎక్కువ కావడంతో తోపులాటకు దారితీసింది. భక్తులు ఇంత భారీ సంఖ్యలో వస్తారని అధికారులు కూడా ఊహించలేకపోయారు. వైకుంఠ ఏకాదశి కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 5 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రారంభించాల్సి ఉండగా రద్దీ నేపథ్యంలో వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించారు. భక్తులు భారీగా తరలిరావడంతో టోకెన్ల జారీ ప్రారంభించామని టీటీడీ ఈవో తెలిపారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి
ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిటిడి అధికారులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

టిటిడి ఫెయిల్ అయ్యిందా?
తిరుమలలో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందడానికి కారకులు ఎవరు? దీనికి బాధ్యత ఎవరిదని భక్తులు చెబుతున్నారు.వైకుంఠ ద్వార దర్శన కోసం పది రోజులపాటు నిర్వోహిస్తామని విస్తృతంగా ప్రచారం చేసిన టీటీడీ ఏర్పాట్ల విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోలేదని భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న భక్తులు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద వేల మంది నిలిపేశారు. సాయంత్రానికి వారందరినీ ఒక్కసారి ఓపెన్ చేయడంతో తోపులాట జరిగింది.

ఉదయం నుంచి టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న వారని కౌంటర్లకు విడిచిపెట్టారు. దీనికి తోడు ఉదయం నుంచి ఇస్తారనుకున్న టికెట్లు జనాన్ని కంట్రోల్ చేయడానికి ముందుగానే ఇవ్వడం ప్రారంభించారు. ఇదే విషయం తెలియడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయం పోలీసులకు చెప్పలేదు. అన్ని ప్రాంతాల్లో ఉన్న హోల్డింగ్ పాయింట్ల వద్ద భారీగా జనం రాకతో పరిస్థితి కంట్రోల్ తప్పింది. ఇంతలో టికెట్లు ఇస్తున్నారని తెలియడంతో భక్తులు వాటిని దక్కించుకోవడానికి పరుగులు పెట్టారు. ఇలా అందర్నీ ఒకేసారి వదలడంతో తోపులాట జరిగింది. ఇలాంటి సమయంలో కింద పడిన భక్తులను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. అధికారులకు, పోలీసులకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని భక్తులు చెబుతున్నారు. గతంలో ప్రత్యేక గదుల్లో ఉంచి టికెట్లు ఇచ్చే వాళ్లని చెబుతున్నారు. అదే పద్దతిని కొనసాగించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News