Wednesday, January 22, 2025

ఉజాని డ్యామ్ లో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర: పూణె జిల్లాలోని ఉజాని డ్యామ్ బ్యాక్ వాటర్‌లో పడవ బోల్తా పడటంతో ఆరుగురు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షం కారణంగా ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు. బాధితుల్లో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఇందాపూర్ తహసీల్దార్ శ్రీకాంత్ పాటిల్ తెలిపారు.

ఈదురు గాలులు, వర్షం కారణంగా కలాషి, భుగవ్ గ్రామాల మధ్య ఏడుగురితో వెళ్తున్న పడవ బోల్తా పడిందని తెలిపారు. బోటులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఒకరు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారని అధికారి తెలిపారు. గల్లంతు అయిని వారికోసం ఎన్‌డిఆర్‌ఎఫ్, స్థానిక అధికారుల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News