Monday, December 23, 2024

రాజా రెడ్డి, రాధా రెడ్డి దంపతులకు అకాడమీ రత్న

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సంగీత్ నాటక అకాడమీ బుధవారం ఆరుగురు అకాడమీ ఫెలో (రత్న)లు, 92 మంది కళాకారుల జాబితాను ప్రకటించింది. 2022, 2023 సంవత్సరాలకు గాను ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకునే కళాకారులలో గాయని బాంబే జయశ్రీ, నటులు అశోక్ సరాఫ్, రాజీవ్ వర్మ ఉన్నారు. జాతీయ సంగీత, నృత్య, నాటక అకాడమీ ప్రదర్శక కళల రంగంలో ప్రసిద్ధ వ్యక్తులను అకాడమీ ఫెలో (రత్న)లుగా ఎంపిక చేసింది. వారిలో కూచిపూడి నృత్య దంపతులు రాజా రెడ్డి, రాధా రెడ్డి, జానపద కళాకారుడు, రచయిత వినాయక్ ఖెడెకర్, వీణ విద్వాంసుడు ఆర్ విశ్వేశ్వరన్, కథక్ డ్యాన్సర్ సునయన హజారిలాల్, రంగస్థల దర్శకుడు దులాల్ రాయ్, నాటక రచయిత డిపి సిన్హా ఉన్నారు. ‘సంగీత్ నాటక్ అకాడమీ, జాతీయ సంగీత, నృత్య, నాటక అకాడమీ జనరల్ కౌన్సిల్

ఈ నెల 21, 22 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రదర్శక కళల రంగంలో ఆరుగురు ప్రసిద్ధ వ్యక్తులను అకాడమీ ఫెలో (రత్న)లుగా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. అకాడమీ ఫెలోషిప్ అత్యంత ప్రతిష్ఠాత్మక, అరుదైన గౌరవం. ఇది ఏ సమయంలోనైనా 40మందికే పరిమితం’ అని కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలియజేసింది. అకాడమీ ఫెలో అవార్డు రూపంలో రూ. 3 లక్షల నగదు బహుమతి ఇస్తారు. అకాడమీ అవార్డుగా లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు, తామ్రపత్రం, అంగవస్త్రం బహూకరిస్తారు. సంగీత్ నాటక అకాడమీ ఫెలోషిప్‌లు, అవార్డులను తరువాత ప్రకటించే తేదీన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహూకరిస్తారు. 2022, 2023 సంవత్సరాలకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను 80 మంది యువ కళాకారులకు కూడా అకాడమీ ప్రకటించింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ రూపంలో రూ. 25 వేల నగదు బహుమతితో పాటు, ఒక తామ్రపత్రం, అంగవస్త్రం బహూకరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News