Sunday, January 19, 2025

లోయలో పడిన స్కూలు బస్సు: ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

హిసర్(హర్యానా): ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ సమీపంలో ఒక స్కూలు బస్సు లోయలో పడి ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది.

హర్యానాలోని హిసర్ జిల్లా పటాన్ గ్రామానికి చెందిన న్యూ మానవ్ ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన విద్యార్థులు, టీచర్లు విహార యాత్ర నిమిత్తం శుక్రవారం నైనిటాల్ బయల్దేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ఒక లోయలో పడిపోయినట్లు ఇక్కడకు సమాచారం అందింది. బస్సులో మొత్తం 31 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News