Sunday, January 19, 2025

ఈనెల 22 నుంచి ఒకే వరుసలో ఆరు గ్రహాలు

- Advertisement -
- Advertisement -

ఈనెల 22 నుంచి 31 వరకు ఒకే వరుసలో ఆరుగ్రహాలు రాబోతున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని ఎలాంటి బైనాక్యులర్ సహాయం లేకుండానే చూసే అవకాశం ఉంటుంది. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్ గ్రహాలు ఒకే వరుస లోని రానున్నాయని ప్లానెటరీ అలైన్‌మెంట్‌గా ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు. చాలా అరుదుగా గ్రహాలన్నీ ఒకే వరుసలో వస్తుంటాయి.ఈ దృశ్యాన్ని అమెరికా, మెక్సికో, కెనడా, భారత్‌లో చూసేందుకు అవకాశం ఉంది.

వీలైనంత వరకు ఎక్కువగా చీకటిగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం మంచిదని ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. శని, బుధుడు, నెప్టూన్ సూర్యాస్తమయం సమయంలో సూర్యుడికి దగ్గరగా వెళ్తాయి. మెర్కురీ, శని, నెప్టూన్ సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్లడంతో గ్రహాలు భూమిపైకి కనిపించడం తగ్గిపోతుంది. శుక్ర గ్రహం సైతం అంతగా కనిపించేందుకు అవకాశం ఉండదు. బృహస్పతి, అంగారకుడు, యురేనస్ కూడా కొద్ది వారాల పాటు అలాగే ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News