వడోదర: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గుజరాత్‌లోని వడోదరలో పనిచేస్తున్న ఆరుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో కేసులో ఉత్తర్ ప్రదేశ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకోనున్న కొద్ది గంటల ముందు బెయిలబుల్ నేరారోపణలపై అరెస్టు అయిన ఒక నిందితుడిని విడుదల చేసినందుకు మంజల్‌పూర్ పోలీసు స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్‌తోసహా ఆరుగురు పోలీసు సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హర్షిల్ లింబాచియా అనే నిందితుడిని గత నెల 21వ తేదీన రూ. 52 లక్షల చీటింగ్ కేసులో అరెస్టు చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు వడోదర చేరుకోగా అంతకు ముందే నమోదు చేసిన మరో కేసులో అతడిని మంజల్‌పూర్ పోలీసులు జామీనుపై విడుదల చేశారు. ఆ తర్వాత మరో కేసులో మే 25న నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హర్షిల్‌పై వడోదర, ఆనంద్ నగరాలలో 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయని డిసిపి యష్‌పాల్ జగనయ తెలిపారు. ఏడు రోజుల పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని యుపి పోలీసులకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. కాగా.. సస్పెండ్ అయిన ఆరుగురు పోలీసులపై విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు.
గుజరాత్‌లో ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -