- Advertisement -
కత్ని జిల్లాలో ఒక మహిళను, ఆమె మనవడిని చితకబాదిన సంఘటనలో ఒక స్టేషన్ ఇన్‌చార్జితోసహా ఆరుగురు ప్రభుత్వ రైల్వే పోలీసు(జిఆర్‌పి) సిబ్బందిని మధ్యపద్రేశ్ ప్రభుత్వం గురువారం సస్పెండ్ చేసింది. దళిత వర్గానికి చెందిన మహిళను, ఆమె మవనడిని రైల్వే పోలీసులు చితకబాదిన ఘటనకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బుధవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం స్పందిస్తూ ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని, దానిపై దర్యాప్తు చేయవలసిందిగా డిఐజిని ఆదేశించానని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఆరుగురు జిఆర్‌పి పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. కాగా..వీడియోకు సంబంధించిన ఘటన గత ఏడాది అక్టోబర్‌లో జరిగినట్లు ఒక సీనియర్ జిఆర్‌పి అధికారి తెలిపారు.
- Advertisement -