Wednesday, January 22, 2025

గూడ్సు రైళ్లు ఢీకొని ఆరుగురు రైల్వే సిబ్బందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

షాదోల్: మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో బుధవారం ఉదయం ఆగి ఉన్న గూడ్సు రైలును మరో గుడ్సు రైలు ఢీకొని పట్టాలు తప్పడంతో ఇద్దరు లోకో పైలట్లతోసహా ఆరుగురు రైల్వే సిబ్బంది గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బిలాస్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని సింఘ్‌పూర్ సమీపంలో ఉదయం 6.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, సిగ్నలింగ్‌లో పొరపాటు కారణంగానే ఈ సంఘటన జరిగిందని అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదం కారణంగా బిలాస్‌పూర్-కట్ని రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు వారు చెప్పారు. ఆ మార్గంలో నడిచే కనీసం 10 రైళ్లు రద్దయినట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్పారు. ఇనుప ఖనిజంతో వెళుతున్న గూడ్సు రైలుకు చెందిన 8 వ్యాగన్లు, రైలు ఇంజన్ పట్టాలు తప్పినట్లు వారు తెలిపారు. కట్ని మధ్యప్రదేశ్‌లో ఉండగా బిలాస్‌పూర్ ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. గాయపడిన రైల్వే సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News