Monday, December 23, 2024

ఇఫ్తికర్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు

- Advertisement -
- Advertisement -

క్వెట్టా: సూపర్‌లీగ్ (పిఎస్‌ఎల్) ఎనిమిదో సీజన్ ఫిబ్రవరి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా క్వెట్టాలో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఇఫ్తికర్ అహ్మద్ గ్లాడియేటర్స్ తరఫున ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో చివరి ఓవర్లోని ఆరుబంతులను ఆరుసిక్సర్లుగా మలిచాడు. టాస్ గెలిచిన జల్మి కెప్టెన్ బాబర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన 20ఓవర్లలో 5వికెట్లకు 184పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో 3పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ జట్టు గెలిచింది. ఇఫ్తికర్ 50బంతుల్లో 94పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుండగా బాంబు పేలుడు సంభవించడంతో మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేశారు. విజేతగా నిలిచిన గ్లాడియేటర్స్ జట్టుకు సర్పరాజ్ అహ్మద్, జల్మి జట్టుకు బాబర్ కెప్టెన్లుగా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News