Tuesday, December 24, 2024

పాక్‌లో హెలికాప్టర్ కూలి ఆరుగురు సైనికాధికారుల మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతోసహా ఆరుగురు పాకిస్తానీ సైనికాధికారులు మరణించారు. ఆదివారం రాత్రి హర్నాయి ప్రాంతంలోని ఖోస్త సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సైన్యం తెలిపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతోసహా హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురు అధికారులు మరణించారని తెలిపింది. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. కాగా..బలూచిస్తాన్ ఇటువంటి దుర్ఘటనే ఆగస్టు 1న సంభవించింది. పాకిస్తాన్ సైనిక హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఒక లెఫ్టినెంట్ జరనల్‌తోసహా ఆరుగురు సైనికాధికారులు మరణించారు. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అప్పట్లో సైన్యం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News