Monday, January 20, 2025

బ్యాంకాక్ హోటల్‌లో సైనైడ్‌తో ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

స్థానిక లగ్జరీ గ్రాండ్ హ్యాత్ ఎర్వాన్ హోటల్‌లో సైనైడ్ బారిన పడి ఆరుగురు విదేశీయులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. వాణిజ్య విలాసవంత నగరం బ్యాంకాక్‌లో జరిగిన ఈ ఘటన గురించి థాయ్ పోలీసులు బుధవారం ప్రకటన వెలువరించారు. హోటల్‌లోని ఒక రూంలో ఆరుగురు శవాలుగా మారడం, అక్కడి టేబుల్‌పై ఉన్న గ్లాసుల మీద అత్యంత విషపూరిత సైనైడ్ అవశేషాలు కనుగొనడంతో ఇది భారీ స్థాయి హత్యాఘటనగా భావిస్తున్నారు. హతుడు కూడా ఈ ఆరుగురిలో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తు క్రమంలో వెల్లడైంది.

మంగళవారం రాత్రి విషప్రయోగం జరిగింది. మరుసటి రోజు తెల్లవారుజామున ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులలో ముగ్గురు మహిళలు, ముగ్గురు మగవారు ఉన్నారు. వీరి బంధువులను ప్రశ్నించగా డబ్చుల వ్యవహారాల్లో తగాదా ఉన్నట్లు తెలిపారు. మృతులలో వియత్నామీలు ఉన్నారు. మృతులలో ఒక్కరు టీలో సైనెడ్ కలిపి అందరికి ఇచ్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ హోటల్ గదిలో కాల్పులు జరిగాయని అంతకు ముందు స్థానిక టీవీ ఛానల్స్‌లో వార్తలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News