Monday, December 23, 2024

గుంటూరు రోడ్డు ప్రమాదంపై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు మరణించడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సిఎం సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.

గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్సను అందించాలని స్థానిక మిర్యాలగూడ ఎంఎల్‌ఎ నలమోతు భాస్కర్ రావును సిఎం కేసిఆర్ ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎ భాస్కర్ రావులు ప్రమాద సంఘటనను వివరించి తగు సహాయం చేయాలని కోరిన మేరకు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రుపాయలు, గాయపడిన వారికి ఒక లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియాను సిఎం కెసిఆర్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News