Friday, November 22, 2024

ఆరు గులాబీలు

- Advertisement -
- Advertisement -

Six TRS party candidates filed nominations

ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి స్థానాలకు టిఆర్‌ఎస్
అభ్యర్థులుగా కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి,
బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు,
పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్లు, ప్రతి అభ్యర్థి పేరును
ప్రతిపాదించిన 10మంది ఎంఎల్‌ఎలు, అనూహ్యంగా
తెరపైకి ముదిరాజ్ వర్గానికి చెందిన బండా ప్రకాశ్ పేరు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఆరు ఎంఎల్‌సి స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఆరుగురు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు సమర్పించగా, మిగిలిన ఇద్దరు శ్రమజీవి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లను అధికారులు బుధవారం పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నెల 29వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Six TRS party candidates filed nominations
టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఆరుగురు

ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికలకు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా బండ ప్రకాష్, వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరిలు మంగళవారం అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్లు అందజేశారు. ప్రతి అభ్యర్థి పేరును పది మంది ఎంఎల్‌ఎలు ప్రతిపాదించారు. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరును మంత్రులు కెటిఆర్, నిరంజన్‌రెడ్డి, రసమయి బాలకిషన్ తదితరులు ప్రతిపాదించగా, బండ ప్రకాష్ పేరును మంత్రి హరీష్‌రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి, మాజీ మంత్రి లకా్ష్మరెడ్డి తదితరులు, రవీందర్‌రావు పేరును మంత్రి జగదీష్‌రెడ్డి, సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, హుజుర్‌నగర్ ఎంఎల్‌ఎ సైదిరెడ్డి తదితరులు, పాడి కౌశిక్‌రెడ్డి పేరును మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి,ఎంఎల్‌ఎలు జోగు రామన్న, బాల్క సుమన్ తదితరులు ప్రతిపాదించారు. అలాగే మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరును మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తదితరులు, గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును మంత్రులు పువ్వాడ అజయ్, ప్రశాంత్‌రెడ్డిలు ప్రతిపాదించారు. శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజ్‌రాజ్ కోయల్కర్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని ఎంఎల్‌ఎలు ఎవరూ ప్రతిపాదించలేదు. కాబట్టి వీరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News