Monday, December 23, 2024

అతివేగానికి ఆరుగురు బలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బాలానగర్/మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల పరిధిలోని హైదరాబాద్, బెంగుళూరు జాతీయ రహదారి చౌరస్తాలో శుక్రవారం సా యంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆ రుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక బాలిక ఉండడంతో తీవ్ర విషాదం అలుముకుంది. మృతులందరిది మోతీఘనపూర్‌వాసులుగా గుర్తించారు. స్థాని కులు, పోలీసులు వివరాల ప్రకారం… బాలానగర్‌లో శుక్రవారం సంత జరుగుతుండటంతో కూరగాయలు తీసుకెళ్లడానికి భారీగా జనం ఇక్కడకు వచ్చారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు కూరగాయల లోడుతో వెళ్తున్న డిసిఎం వాహనం వేగంగా వస్తూ రోడ్డు దాటుతున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందా రు. మరి కొందరికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఒక ద్విచ క్ర వాహనదారుని పరిస్థ్ధితి విషమంగా ఉండడంతో వారినందరిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికి త్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురై జాతీయ రహదారి రక్తసిక్తంగా మారింది. మృతు ల్లో చిన్నారులు కూడా ఉండండంతో పలువురిని కంట తడి పెట్టించింది. సంఘటనను తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బాధితులకు ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు మెరుగైన చికి త్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
డిసిఎం వాహనానికి నిప్పు
ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోవడంతో ఆగ్రహం చెందిన స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. డిసిఎం వాహనానికి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన డిసిఎం డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సంత రోజు రద్దీ
ఇక్కడ ప్రతి శుక్రవారం ఇక్కడ వారం సంత జరుగుతుంది. ఈ సంత జాతీయ రహదారి పక్కన రోడ్డుపైనే ఉంటుంది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అనేక మంది ఈ సంతకు హాజరై సాయంత్రం తిరిగి తమ తమ ఊర్లకు వెళ్తుంటారు. జాతీయ రహదారి కూడా బాలానగర్ మధ్యలో ఉండడంతో వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. అయితే కనీసం సంత రోజు కూడా రోడ్డు మధ్యలో ట్రాఫిక్ పోలీసు ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆటో డ్రైవర్లు కూడా చాలా నిర్లక్షంగా యూటర్న్ తీసుకుంటారని చెబు తున్నారు. అతివేంగా వెళ్తున్న వాహనాలకు తోడు, ఆటో డైవ్రర్ల నిర్లక్ష డ్రైవింగ్ ఫలితమే ఆరుగురు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోవడం కారమని భావిస్తున్నారు.
ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి
బాలానగర్ చౌరస్తాలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలానగర్ మండల కేంద్రం మధ్యలో జాతీయ రహదారి వెళ్తుండడంతో నాలుగు రోడ్ల చౌరస్తాగా మారింది. దీంతో వాహనాలు చాలా వేగంగా వస్తుంటాయి. రోడ్డు మధ్యలో డివైడర్లు వేసినప్పటికీ ఆ వేగానికి ఆవేవి సరిపోయే విధంగా లేకపోవటంతో నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ చాలా కాలంగా ప్రజలు ఫ్లైఓవర్ బ్రిడ్జి వేయాలని కోరినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News